: నేడు సీఎం నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం


బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పుపై అంతిమ సమరానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి, ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కృష్ణా మిగులు జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై చర్చించనున్నారు. తీర్పుపై ప్రభుత్వ పరంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అన్ని పార్టీల కీలక నేతలతో చర్చించిన అనంతరం, సీఎం ఒక తుది నిర్ణయానికి రానున్నారు.

  • Loading...

More Telugu News