: ప్రాణాపాయాన్ని ముందుగానే గుర్తించవచ్చు


గర్భంలో ఉన్న శిశువుకు ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తుందా? అనే విషయం అంత తేలిగ్గా గుర్తించలేము. అయితే ఒక ప్రత్యేక పరీక్ష ద్వారా గర్భస్థ శిశువు ప్రాణాపాయ స్థితిని గురించి ముందుగానే గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్ష ద్వారా నిర్జీవ జననాలు (స్టిల్‌బార్న్‌) జరగకుండా నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పరీక్షను రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా గర్భస్థ శిశువు గర్భంలో ఉండగానే ఆ బిడ్డ ప్రాణాలకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా మృతశిశు జననాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలు నిర్జీవ శిశు జననానికి దారితీసే ప్రమాదం ఉందా? అనే అంశాన్ని ఈ పరీక్ష కచ్చితంగా నిర్ధారిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గర్భంలో ఉన్న శిశువుకు తగిన మోతాదులో ప్రాణవాయువు లభించకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో తల్లి రక్తప్రసరణ వ్యవస్థలో ఆర్‌ఎన్‌ఏ విడుదలవుతుంది. ఈ ఆర్‌ఎన్‌ఏ పరిమాణమే గర్భస్థ శిశువు లోపలున్న ప్రాణవాయువు స్థాయిలను ప్రతిబింబిస్తుంది. గర్భస్థ శిశువులో ప్రాణవాయువు స్థాయిలు ప్రమాదకర రీతిలో పడిపోయివున్నట్టు ఆర్‌ఎన్‌ఏ ద్వారా నిర్ధారణ అయితే మాత్రం నిర్జీవ జననానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరీక్ష ద్వారా గర్భస్థ శిశువుకు ప్రాణాపాయాన్ని గురించి ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News