: అన్నా హజారే ఆమరణ దీక్ష రేపటి నుంచే
అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి పోరుబాట పడుతున్నారు. జన్ లోక్ పాల్ బిల్లును అమల్లోకి తీసుకురావాలనే డిమాండ్ తో ఆయన రేపటి నుంచి మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అవినీతి నిర్మూలనకు వీలుగా అన్నాహజారే దేశవ్యాప్త ఉద్యమంతో కాంగ్రెస్ లోక్ పాల్ బిల్లును తీసుకొచ్చి లోక్ సభలో ఆమోదం తెలిపింది. కానీ అది ఇంతవరకు రాజ్యసభ ఆమోదానికి నోచుకోలేదు. బిల్లు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో హజారే మరోసారి ఉద్యమబాట పడుతున్నారు.