: ఇలా అయితే కాంగ్రెస్ కు కష్టమే: శరద్ పవార్
కాంగ్రెస్ పార్టీలో బలహీన నాయకత్వం ఉందని, అలా ఉంటే ప్రజలు ఇష్టపడరని ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ ఘాటూగా వ్యాఖ్యానించారు. ఓటమి నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాలని, యూపీఏ పక్షాలు ఆత్మ పరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటేనే రానున్న ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని సూచించారు.