: గురకే కదా అనుకుంటే గుండె జబ్బులు తప్పవు


అవును మరి.. గురకే కదా అనుకుంటే గుండెజబ్బులు తప్పవు. ప్రశాంతంగా నిద్రపోయే వారితో పోల్చి చూసినప్పుడు బీభత్సంగా గురక పెట్టే వారికి గుండె పోటు రాగల ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి. గురకకు, గుండెజబ్బులకు మధ్య ఉండే లింకును తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు 25 వేల మంది గురకరాయుళ్లను అధ్యయనం చేశారు. అయితే వీరిలో గుండెజబ్బులకు గురికాగల ప్రమాదం 80 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని తేల్చారు.

స్లీపింగ్ ఎప్నియా అనే పేరుగల ఈ గురకతో మగాళ్లలో ప్రతి నలుగురిలోను ఒకరు, మహిళల్లో ప్రతి పదిమందిలో ఒకరు దాదాపుగా మొత్తం 30 లక్షల మంది ఇబ్బంది పడుతున్నట్లు వారు తేల్చారు. స్లీప్ అప్నియా అంటే.. శ్వాస పీల్చడంలో అవాంతరాల వల్ల.. చప్పుడు కావడం అని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో జరిగిన 12 రకాల అధ్యయనాల ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత... చైనాలోని శాన్ డోంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాల్ని నిగ్గు తేల్చారు.

  • Loading...

More Telugu News