: రోడ్డు ప్రమాదంలో మంచు మనోజ్ కు గాయాలు
సినీ నటుడు మంచు మనోజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న మనోజ్ కారుకు అప్పా జంక్షన్ వద్ద గేదె అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు బోల్తా పడటంతో మనోజ్ కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మనోజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించారు.