: ఢిల్లీలో హంగ్... అధికార పీఠానికి నాలుగడుగుల దూరంలో నిలిచిన బీజేపీ
ఈ రోజు ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ ఫలితాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోగా, బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజీపీ 32 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించగా, ఏఏపీ 28 సీట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఘోర ఓటమిని పొందిన కాంగ్రెస్ కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుంది. మిగిలిన రెండు సీట్లను ఇతరులు కైవసం చేసుకున్నారు. దీంతో, ఎంతో ఉత్కంఠను రేపిన ఢిల్లీ ఎన్నికలు చివరకు హంగ్ ముంగిట నిలిచాయి.