: ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి: లగడపాటి


నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం మన రాష్ట్రంపై కూడా తప్పకుండా ఉంటుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. దత్తపుత్తుడు, వేర్పాటు పుత్రుడి కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం సరైన చర్య కాదని అన్నారు. సరైన పార్టీ, నిజాయతీ కలిగిన వ్యక్తులు వస్తే... ఎలాంటి పార్టీనైనా ఓడించవచ్చని ఢిల్లీ ఫలితాలు నిరూపించాయని తెలిపారు. సామాన్య ప్రజలను ఎన్నికల బరిలో నిలబెట్టి కేజ్రీవాల్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారని అన్నారు. కేజ్రీవాల్ ప్రజా విధానానికి శిరస్సు వంచి నమస్కరించవచ్చని తెలిపారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి తాను చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయని చెప్పారు. గుణపాఠం నేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... రెండు సార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మోసం చేయడం మంచిది కాదని అధిష్ఠానానికి సూచించారు.

  • Loading...

More Telugu News