: ఇది ప్రజా విజయం: కేజ్రీవాల్


ఇది ప్రజావిజయమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉదయం నుంచి కూడా ఏఏపీకి ఆధిక్యత వస్తున్నా ఆయన మీడియా ముందుకు రాలేదు. కానీ, ఏఏపీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో, ఒక్కసారి అలా కనిపించారు. ఆ సమయంలో కార్యకర్తలు కేజ్రీవాల్ పై పూల వాన కురిపించారు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న ఆయన, ఇది ప్రజావిజయమని మాత్రమే చెప్పి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. పార్టీ పెట్టకముందే ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ పై పోటీ చేసి ఆమెను ఓడగొడతానని ఛాలెంజ్ చేసిన కేజ్రీవాల్... చివరకు అనుకున్నది సాధించారు.

  • Loading...

More Telugu News