: మధ్యప్రదేశ్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా: శివరాజ్ సింగ్ చౌహాన్
రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రజలకు మరింత సేవచేస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న తరుణంలో, ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తమపై ఎంతో నమ్మకంతో వరుసగా మూడోసారి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.