: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్య లేదు: సచిన్ పైలట్


నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు డీలా పడిపోయారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ప్రభావాన్ని చూపిందని కేంద్ర మంత్రి సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు. అయితే, దేశ రాజకీయాలలో ఇదొక ఆహ్వానించదగిన కొత్త పరిణామమని అన్నారు. భవిష్యత్తులో ఏఏపీని ఎలా ఎదరుర్కోవాలన్న విషయంపై కాంగ్రెస్ పెద్దలు చర్చిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోందని వస్తున్న వార్తలు అవాస్తవమని... పార్టీలో నాయకత్వం లోపం లేదని పైలట్ అన్నారు.

  • Loading...

More Telugu News