: రాజస్థాన్ గెలుపులో మోడీదే కీలక పాత్ర: వసుంధరా రాజే
రాజస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన క్లీన్ మెజారిటీ సాధించే దిశగా బీజేపీ వెళుతోంది. వెలువడుతున్న ఫలితాలతో రాజస్థాన్ బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే ఆనందంలో మునిగిపోయారు. రాజస్థాన్ లో బీజేపీ ఇంత స్థాయిలో పుంజుకోవడానికి కేవలం నరేంద్ర మోడీయే కారణమని కొనియాడారు. ఆయన ఛరిష్మా, నాయకత్వ లక్షణాలే జీజేపీని విజయపథంలో నడిపిస్తున్నాయని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా మోడీ నాయకత్వంలో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు.