: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ భారీ ఆధిక్యం
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 135 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 56 స్థానాల్లో, బి.ఎస్.పి 3, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాజస్థాన్ లో బీజేపీ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 31 స్థానాల్లో, బి.ఎస్.పి 3, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఢిల్లీ లో బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఎ.ఎ.పి 22, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 37 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.