: బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిదే


బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడుకాయలు మంచివేనని తెలుసుకున్నాం. ఇప్పుడు కూరగాయల్లో మరొకటి కూడా బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపకరిస్తుందట. అదే బెండకాయ! చాలామందికి బెండకాయ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దీంతో చిన్న తనంలో అమ్మలు 'బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి' అంటూ కబుర్లు చెప్పి తమ పిల్లల చేత బెండకాయ తినిపించేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి బెండకాయలో బోలెడు పోషకాలు ఉన్నాయి. వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. వంద గ్రాముల బెండకాయనుండి 30 గ్రాముల కెలోరీలు మాత్రమే లభిస్తాయి.

మన శరీరానికి హాని కలిగించే శాచ్చురేటెడ్‌ కొవ్వులు, కొలెస్టరాల్‌ బెండలో అంతగా ఉండవు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు నిరభ్యంతరంగా వీటిని ఆహారంలో తీసుకోవచ్చు. మలబద్దకంతో బాధపడేవారికి ఇది చక్కగా పనిచేస్తుంది. బెండలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. షుగరు రోగులకు కూడా బెండ చక్కగా ఉపయోగపడుతుంది. బెండతో చేసిన పదార్ధాల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) విలువ తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు పలు ఆహార సమస్యలను నివారిస్తాయి. కాబట్టి బెండను చక్కగా తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

  • Loading...

More Telugu News