: సంజయ్ దత్ పెరోల్ పై విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర హోంమంత్రి
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు పెరోల్ మంజూరు చేయడం వివాదాల్లో పడింది. పుణెలోని ఎరవాడ జైలు అధికారులు సంజయ్ కు నెల రోజుల పెరోల్ అంగీకరించడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో, స్పందించిన మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ విచారణకు ఆదేశించారు. తమ రాష్ట్ర శాసనసభ దీనిపై చర్చిస్తుందని అన్నారు. వివరాల్లోకి వెళితే.. భార్య మాన్యతకు ఆరోగ్యం బాగోలేని కారణంగా తాను వెళ్లేందుకు పెరోల్ కావాలని సంజూ జైలు అధికారులకు చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్నాడు. కానీ, రెండు రోజుల కిందటే మాన్యత ఓ హిందీ చిత్రం స్క్రీనింగ్ లో పాల్గొని, ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. దాంతో, సంజయ్ కు పెరోల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ రోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆన్ పీఐ) కార్యకర్తలు జైలు బయట ధర్నా చేశారు.