: 8-13ఏళ్ల చిన్నారులపై వార్డెన్ లైంగిక అకృత్యాలు
వారంతా పేదలు, అనాథలు. 8 నుంచి 13 ఏళ్లలోపు వారు. ఓ కమ్యూనిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారి సంక్షేమం చూడాల్సిన వార్డెన్ లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకోవడం దారుణాతి దారుణం. గుజరాత్ రాష్ట్రం పోరుబందర్ లోని ఓ బాలుర హాస్టల్లో వార్డెన్ రాజుకనాని 10 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది తెలిసి యాజమాన్యం అతడిని వెంటనే తొలగించడం.. అతడు పరారీ కావడం జరిగిపోయాయి. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.