: పరారీలో ఉన్నవారికి బెయిల్ కుదరదు: సుప్రీంకోర్టు
నిందితులు పరారీలో ఉన్నట్లు కింది కోర్టులు ప్రకటిస్తే.. విచారణకు సహకరించకపోతే వారికి పై కోర్టులు బెయిల్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రదీప్ శర్మ ఒక హత్య కేసులో నిందితుడు. ఇతడికి మధ్యప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.