: ఎన్నికల వ్యయంపై కేజ్రీవాల్ కు ఈసీ నోటీసు
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వ్యయానికి, ఎన్నికల అధికారులకు రిజిస్టర్ లో చూపిన మొత్తానికి మధ్య తీవ్ర వ్యత్యాసముందని పేర్కొంటూ రెండు రోజుల కిందట (గురువారం) నోటీసు ఇచ్చినట్లు సీనియర్ ఎన్నికల అధికారి ఒకరు పేర్కొన్నారు. తన అభ్యర్ధులకు మూడు లక్షలు ఖర్చు చేసినట్లు కేజ్రీవాల్ చూపితే, రిజిస్టర్ లో రూ.16 లక్షలు వ్యయం చేసినట్లు ఉందన్నారు. దాని ప్రకారం నిన్ననే (శుక్రవారం) కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆయన నగరంలో లేకపోవడంతో కొన్ని రోజుల గడువు ఇచ్చారు.