: తప్పులో కాలేసిన శాస్త్రవేత్తలు.. హెచ్ఐవీపై అంచనా తప్పింది


శాస్త్రవేత్తలు తప్పులో కాలేశారు.. రక్తంలోని మూలుగ మార్పిడి చికిత్స చేసిన తరువాత ఇద్దరు రోగులకు పూర్తిగా నయమైపోయింది అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ వారి అంచనా తప్పింది. వారికి మళ్లీ హెచ్ఐవీ వచ్చిందని అమెరికా వైద్యులు చెబుతున్నారు. దీంతో తాము అంచనా వేసిన దానికంటే వైరస్ ను కలిగి ఉన్న హెచ్ఐవీ రిజర్వాయర్లు, లేటెంట్ కణాలు చాలా లోతుగా ఉన్నాయని తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాము చికిత్స చేసిన రోగులకు మళ్లీ హెచ్ఐవీ రావడం నిరుత్సాహంగా ఉన్నప్పటికీ, శాస్త్రీయంగా మాత్రం చాలా కీలక దశకు చేరామని వారు పేర్కొన్నారు. దీని ప్రకారం ఇప్పుడు మనం హెచ్ఐవీని అంచనా వేయడంలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ప్రమాణాలు ఏమాత్రం సరిపోవని అర్థమవుతోందని వారు తెలిపారు. 2008, 2010 సంవత్సరాల్లో ఇద్దరు హెచ్ఐవీ రోగులకు మూలుగ మార్పిడి చికిత్సలు చేసి 8 నెలలు అబ్జర్వేషన్ లో పెట్టారు.

తరువాత వారిలో హెచ్ఐవీ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఈ ఏడాది యాంటీ రిట్రోవైరల్ చికిత్స ఆపేద్దామని భావించి చివరిసారి వైద్య పరీక్షలు చేశారు. అప్పుడు కూడా వారిలో వ్యాధి లక్షణాలు కన్పించలేదు. దీంతో వైద్యం ఆపేసిన నెల తరువాత పరీక్షిస్తే వారిలో మళ్లీ హెచ్ఐవీ లక్షణాలు కన్పించాయి. దీంతో చికిత్స మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News