: మహానేత అంత్యక్రియలకు ఒబామా
నల్లజాతీ సూరీడు.. దక్షిణాఫ్రికా జాతిపిత.. దివంగత మహానేత నెల్సన్ మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకానున్నారు. ఆ మహనీయుడి మృతికి పదిరోజులు సౌతాఫ్రికా సంతాపదినాలు ప్రకటించింది. భారత్ కూడా ఐదు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. మండేలాకు భారత్ తో ఆత్మీయబంధం ఉంది. మండేలాకు స్ఫూర్తి నిచ్చినది మహాత్మాగాందీ అని ఆయనే పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మన దేశం మండేలాను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. కాగా వచ్చే ఆదివారం ఈస్టరన్ కేప్ లోని క్యూనులోని మండేలా స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ప్రపంచదేశాలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు.