: ఎంపీ మోదుగులను అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు బయల్దేరారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా తళ్లూరు మండలం పెదపరిమి వద్దకు రాగానే పోలీసులు మోదుగుల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.