: సేల్‌ కాకుంటే తగలేస్తారట!


మామూలుగా చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు సేల్‌ కాకుంటే ఏం చేస్తారు... డిస్కౌంట్లు ఇచ్చి వస్తువులను చక్కగా అమ్ముడు పోయేలా చేసుకుంటారు. దీనివల్ల వస్తువు అమ్ముడుపోతుంది. డిస్కౌంటు ఇచ్చిన ఫీలింగ్‌ అటు వినియోగదారుల్లో కూడా కలుగుతుంది. ఉభయతారకంగా ఉంటుంది. కానీ ఒక హ్యాండ్‌ బ్యాగులు తయారుచేసే సంస్థ మాత్రం తమ ఉత్పత్తులు అమ్ముడుపోకుంటే వాటన్నింటినీ పోగేసి కాల్చేస్తుందట.

హ్యాండ్‌ బ్యాగులు, పర్సులను తయారుచేసే లూయీ విటన్‌ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్నారు. ఈ సంస్థ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ కూడా ఉంది. కంపెనీ ఎంత పెద్దదైనా సంవత్సరాంతంలో అమ్ముడుపోని తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మేసేందుకు ప్రయత్నిస్తే లూయీ విటన్‌ మాత్రం ఇలా చేయదు.

ఇలా తక్కువ ధరకు తమ ఉత్పత్తులను అమ్మడం వల్ల అటు వినియోగదారుల్లో తమ కంపెనీ ఉత్పత్తులకు ఉండే క్రేజ్‌ తగ్గిపోతుంది అని భావించిందో ఏమో లూయీ విటన్‌ మాత్రం తమ అమ్ముడుపోని హ్యాండ్‌ బ్యాగులను వదిలించుకోవడానికి ప్రతి ఏటా ఒక వింత పద్ధతిని ఆచరిస్తుందట. అదేమంటే అమ్ముడుపోని బ్యాగులన్నింటినీ పోగేసి తగలబెట్టేస్తుందట. అవును మరి తమ కంపెనీ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తే దాని ప్రభావం తర్వాత కంపెనీ ఉత్పత్తులపై పడుతుందని కంపెనీ అభిప్రాయం కాబోలు!

  • Loading...

More Telugu News