: రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన ముసాయిదా బిల్లు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లు రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. కేంద్ర హోం శాఖ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. బిల్లును ఎప్పుడు అసెంబ్లీకి పంపాలనే విషయంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 8న సాయంత్రానికి ఆయన ఢిల్లీ చేరుకుంటారు.