: పార్లమెంటులో బిల్లు పాస్ అయినప్పుడే సంబరాలు: కేసీఆర్
తాను పక్కదారి పడితే రాళ్లతో కొట్టండని ఆనాడే చెప్పానని కేసీఆర్ తెలిపారు. తనకు సహకరిస్తే వంద శాతం తెలంగాణ తెస్తానని అప్పుడే హామీ ఇచ్చానని అన్నారు. ఇప్పుడు కేవలం ముసాయిదా బిల్లు మాత్రమే తయారయిందని... పూర్తి స్థాయిలో పార్లమెంటులో బిల్లు పాస్ అయితేనే పోరాటం ముగుస్తుందని అన్నారు. అప్పుడే సంబరాలు చేసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్ కు, కేంద్ర కేబినెట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముసాయిదా బిల్లును రిటైర్డ్ ఐఏఎస్, నీటిపారుదల శాఖ అధికారులతో అధ్యయనం చేయిస్తున్నామని అన్నారు.