: రాత్రిలోపు రాష్ట్రపతికి విభజన బిల్లు ముసాయిదా: దిగ్విజయ్
ఈ రాత్రి లోపు రాష్ట్రపతికి విభజన బిల్లు ముసాయిదాను పంపే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అనంతరం రాష్ట్రపతి దాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారని తెలిపారు. అసెంబ్లీకి ఎంత సమయం ఇవ్వాలనేది రాష్ట్రపతి ఇష్టమని అన్నారు. సీమాంధ్ర నేతలు తమ అభిప్రాయాలను అసెంబ్లీలో చెప్పుకోవచ్చని... వారి డిమాండ్లను బిల్లులో పొందుపరుస్తామని చెప్పారు. అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. తెలంగాణ విభజన బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు రాకపోతే, దానికోసం ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ చెప్పారు.