: విభజన నిర్ణయంపై రేపు ముఖ్యమంత్రి స్పందన
మొదటి నుంచి సమైక్యాంధ్ర గళాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పది జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ఇంతవరకు మాట్లాడని సంగతి తెలిసిందే. అయితే, రేపు పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం స్పందిస్తానని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ రోజు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏడో విడత భూ పంపిణీని ప్రారంభించిన కిరణ్, కేంద్రం నిర్ణయంపై మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.