: ఏప్రిల్ 14న వెనెజులా ఎన్నికలు
కొన్ని రోజుల కిందట అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణించడంతో, వెనెజులా తిరిగి ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం ఏప్రిల్ 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నికొలస్ మదురో ఆదివారం తెలిపారు. మరోవైపు గతంలో చావెజ్ పై పోటీచేసి ఓడిన హెన్రిక్ క్యాప్రిలెస్ నే మళ్లీ తమ అభ్యర్ధిగా ఆ దేశ ప్రతిపక్ష కూటమి ప్రకటించడం గమనార్హం.