: బాబ్రీ విధ్వంసానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలి: ఎస్పీ
బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 21 ఏళ్లు అయిన సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు భవనం ముందు ఎస్పీ నేతలు నిరసనకు దిగారు. నరేష్ అగర్వాల్ నేతృత్వంలో ఎంపీలు బీజేపీ వ్యతిరేక నినాదాలు, బ్లాక్ డే సందేశాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. నాటి బాబ్రీ విధ్వంసం ఘటనలో దోషులను ఇంతవరకు శిక్షించలేదని నరేష్ అగర్వాల్ అన్నారు. ఈ ఘటనపై బీజేపీ దేశానికి క్షమాపణ చెప్పాలని కోరారు.