: తణుకు ఎమ్మెల్యే వాహనం ధ్వంసం.. ఉద్రిక్తం


కేబినెట్ నిర్ణయంపై పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం అట్టుడుకుతోంది. సాధారణ పౌరుల ఆగ్రహావేశాలకు, రాజకీయ పార్టీల మద్దతు తోడవడంతో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో, తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు అద్దాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రపతి రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News