: విభజన నిర్ణయంపై రగులుతున్న విశాఖ
విభజన నిర్ణయంపై విశాఖ రగులుతోంది. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఏపీఎన్జీవోలు బంద్ కు పిలుపునిచ్చారు..ఇక వైఎస్ఆర్సీపీ, టీడీపీ శ్రేణులు కూడా బంద్ కు మద్దతు ప్రకటించాయి. విశాఖపట్నంలో సమైక్య వాదులు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. దీంతో ఎక్కడికక్కడ బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో ఇవాళ, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్శిటీ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమో పరీక్షలు జనవరి 2వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది. కేజీహెచ్ లో వైద్య సేవలను కూడా నిలిపివేశారు. అత్యవసర వైద్య సేవలను మాత్రం కొనసాగిస్తున్నట్లు కేజీహెచ్ జేఏసీ కన్వీనర్ శ్యాంసుందర్ తెలిపారు.