: ఈ పెన్నుతో ఎముకలను రిపేరు చేయవచ్చు


పెన్నుతో ఎముకలను ఎలా రిపేరు చేయవచ్చు... అని మీకు సందేహంగా ఉందా... అంటే ఇది రాసుకునే పెన్ను తరహాలోనే ఉన్నా పేపరుపై రాయడానికి మాత్రం పనికిరాదు. ఎముకలపై రాయడానికి మాత్రమే పనికొస్తుంది. ఈ పెన్నుతో రాయడం వల్ల మనకు అవసరమైన ఎముకలు కూడా పెరుగుతాయట. పెద్ద పెద్ద ప్రమాదాల వల్ల కొన్నిసార్లు ఎముకలు ధ్వసం అయిపోతాయి. వయసు పెరిగేకొద్దీ మోకాలు వద్దనున్న మృదులాస్థి అరిగిపోయినప్పుడు వైద్యులు ఎముకలను ఇంప్లాంట్‌ చేస్తుంటారు. అలాగే ప్రయోగశాలలో మూలకణాలతో కొన్ని వారాలపాటు మృదులాస్థిని అభివృద్ధి పరచికూడా ఎముకల స్థానంలో అమరుస్తుంటారు. అలాకాకుండా ఈ పెన్నుతో పాత ఎముక ఎలా వుందో అలాగే బొమ్మ గీస్తే అప్పుడు చక్కగా పాడైపోయిన ఎముక స్థానంలో కొత్త ఎముక పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వోలాంగాంగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం 'బయోపెన్‌'ను ఆవిష్కరించారు. ఈ పెన్నుతో ఎముకలు దెబ్బతిన్నచోట మూలకణాలను అచ్చులా పోసి ఎముకలను పెంచవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 3డీ ప్రింటర్‌లాగా పనిచేసే ఈ పెన్నులో మూలకణాలు, జెల్‌ పదార్ధాలు, ఇతర పోషక పదార్థాలను కలిపి ఇంకులాగా వాడతారు. ఈ ఇంకును నేరుగా ఎముకలు దెబ్బతిన్నచోట కావాల్సిన ఆకారంలో అచ్చులాగా పోస్తే చాలు, ఆ ఇంకు మూలకణాలుగా విభజన చెందుతూ ఎముకలను ఉత్పత్తి చేస్తాయి.

ఇప్పటికే శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం పెన్నుతో మోకాలు వంటి మూసలపై మృదులాస్థిని పెంచగలిగారు. దీనిపై మెల్‌బోర్న్‌లోని విన్సెంట్స్‌ ఆసుపత్రిలో ఔషధ పరీక్షలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పెన్నుతో ఎముకలు మాత్రమే కాకుండా కండరాలు, ఇతర నాడీకణాలను కూడా పెంచవచ్చని ఈ పరిశోధకుల బృందానికి సారధ్యం వహించిన పీటర్‌ చూంగ్‌ చెబుతున్నారు. మూలకణాలతోపాటు కలిపే ఇతర పదార్ధాలతో ఎలాంటి హానీ ఉండదని, ఎముక కణాలు ఖాళీ చోటును ఆక్రమించగానే జెల్‌ పదార్ధాలు విచ్ఛిన్నమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News