: సంపన్నుడిగా పుట్టినా కటిక దరిద్రం అనుభవించాడు


పుట్టడం సంపన్న కుటుంబంలోనే అయినా బ్రతికినంతకాలం కటిక దరిద్రం అనుభవించాడు. చివరికి తన జన్మ రహస్యం తెలిసి వృద్ధాప్యంలో తన దారిద్య్రానికి కారకులైన వారినుండి పెద్ద మొత్తంలో జరిమానా వసూలు చేసేలా కోర్టు తీర్పునివ్వడంతో ఇప్పుడు సంపన్నుడు కాబోతున్నాడు.

జపాన్‌లో ఒక వ్యక్తి పుట్టుకతో సంపన్న కుటుంబంలోనే పుట్టాడు. కానీ పుట్టినప్పుడు ఆసుపత్రి వర్గాలు మరో పిల్లాడి స్థానంలో అతడిని మార్చేశాయి. దీంతో చక్కగా సంపన్నుడిగా బతకాల్సిన ఆ వ్యక్తి పేదరికాన్ని అనుభవిస్తూ వచ్చాడు. 60 ఏళ్ల వయసులో తన పుట్టుకకు సంబంధించిన రహస్యం తెలిసిన ఆ వ్యక్తి ఆసుపత్రి వర్గాలు చేసిన దుర్మార్గానికి రగిలిపోయాడు. తన జీవితం ఇలా పేదరికాన్ని అనుభవించడానికి కారకులైన ఆసుపత్రి వర్గాలపై పరువునష్టం దావా వేశాడు.

ఈ కేసును విచారించిన టోక్యో జిల్లాకోర్టు ఆసుపత్రికి రూ. 2.33 కోట్లు అంటే 3,74,000 అమెరికా డాలర్లును జరిమానాగా విధించి, ఆ మొత్తాన్ని సదరు వృద్ధుడికి చెల్లించాలని ఆదేశించింది. అంతకాలం పేదరికాన్ని అనుభవించిన తాను అంత డబ్బుతో మరోసారి అరవై ఏళ్లు వెనక్కి వెళ్లాలని ఆశపడుతున్నట్టు సదరు వృద్ధుడు ఆనందంతో చెబుతున్నాడు. మరోవైపు ఆసుపత్రి మాత్రం తాము పైకోర్టుకు అప్పీలుకు వెళతామని చెబుతోంది.

  • Loading...

More Telugu News