: రాజకీయ నేతలవల్లే క్రీడాకారులకు నష్టం: సుప్రీం


క్రీడలకు, క్రీడాకారులకు జరుగుతున్న నష్టంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు క్రీడా సంఘాలకు అధ్యక్షత వహించడం వల్లే తీవ్ర నష్టం జరుగుతోందని అభిప్రాయపడింది. ప్రధానంగా దేశంలో హాకీ క్రీడ పతనమవుతుండటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. క్రీడల్ని ప్రైవేటు వ్యక్తులు నియంత్రిస్తున్నారని... ఆటలతో ఏమాత్రం సంబంధంలేని వారు క్రీడా సంస్థలకు నాయకత్వం వహించడం వల్ల తీవ్రనష్టం వాటిల్లుతోందని న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News