: విజయవాడలో సమైక్య యువజన సదస్సులో పాల్గొన్న అశోక్ బాబు


విజయవాడలో జరిగిన సమైక్య యువజన సదస్సులో ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 9వ తేదీన ఆందోళన చేయాలని నిర్ణయించామని చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే తాము ఉద్యమిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు బుల్లెట్ లాగా మారి ఉద్యమించాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజించవద్దని తాము కోరుకుంటుంటే.. రాయలసీమను కూడా విభజించేందుకు చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News