: 18వ అంతర్జాతీయ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా షబానా అజ్మీ
రేపటి నుంచి తిరువనంతపురంలో 18వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రారంభ చిత్రంగా ఇజ్రాయెల్ సినిమా ‘అనా అరాబియా’ని ప్రదర్శించనున్నారు. 85 నిమిషాల నిడివి గల ఈ సినిమాని అమోస్ గితాయ్ రూపొందించారు.