: లాభ నష్టాల బేరేజు వేసుకుంటున్న కాంగ్రెస్: యనమల
రాష్ట్ర విభజనవల్ల తమకు ఎంత లాభమో కాంగ్రెస్ పార్టీ బేరీజు వేసుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం తమకు తెలంగాణ వల్ల లాభమా? లేక రాయల తెలంగాణ వల్ల ఎక్కువ లాభమా? అని లెక్కలు చూసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనను కేంద్రప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందన్న యనమల, కేబినెట్ నోట్ చూశాకే తాము స్పందిస్తామన్నారు.