: సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట హరీష్ రావు ధర్నా
రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేపట్టిన తెలంగాణ బంద్ కొద్దిపాటి చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేత హరీష్ రావు సిద్దిపేట ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించారు. ఆయనకు మద్దతుగా తెరాస, ఐకాస శ్రేణులు కూడా బైఠాయించి నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, రాయల తెలంగాణ తమకు అవసరం లేదని, పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని డిమాండ్ చేశారు.