: ఈ డైపర్‌ పెద్దలకోసం


సాధారణంగా పిల్లలు పక్క తడిపేస్తుంటారు. దీంతో ఎక్కువమంది డైపర్లు వాడుతారు. అయితే కొందరు పెద్దలు కూడా మూత్ర విసర్జనను అదుపు చేయలేకపోతారు. వయసు మీదపడడం వల్ల నరాల పటుత్వం తగ్గుతుంది. దీంతో మూత్ర విసర్జన నియంత్రణ కష్టమవుతుంది. ఇలాంటి పెద్దవారికోసం ప్రత్యేకంగా డైపర్లను తయారుచేశారు. ఈ డైపర్‌ మూత్ర విసర్జనకొరకే కాకుండా ఇలా మూత్ర విసర్జనను నియంత్రించుకోలేకపోవడానికి కారణాలను కూడా గుర్తిస్తుందని తయారుచేసినవారు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన సిమవతి కంపెనీవారు మూత్ర విసర్జనను నియంత్రించుకోలేని పెద్దలకోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ డైపర్లను తయారుచేశారు. ఈ డైపర్లద్వారా మూత్ర విసర్జనపై వ్యక్తులకు నియంత్రణ లేకపోవడానికి కారణాలను కూడా తెలుసుకోవచ్చని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ముందుగా ఈ డైపర్లను వాడి 72 గంటలపాటు సదరు వ్యక్తిని పర్యవేక్షిస్తారు. తర్వాత వీటిలో అమర్చిన సెన్సార్ల ద్వారా వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌తో విశ్లేషించి ఒక రేఖా చిత్రాన్ని రూపొందిస్తారు. ఈ రేఖాచిత్రం ద్వారా ఆ వ్యక్తి మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడానికిగల కారణాలను తెలుసుకోవచ్చని కంపెనీవారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News