: భారత్ తో జరిగే యుద్ధంలో పాక్ గెలవలేదు: ప్రధాని
కాశ్మీర్ సరిహద్దు వద్ద నిరంతరం జరిగే వివాదంవల్ల భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగో యుద్ధం రావచ్చంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో ఈ రోజు నావీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. 'నా జీవిత కాలంలో భారత్ తో జరిగే యుద్ధంలో పాక్ గెలిచే అవకాశం లేదు' అని పేర్కొన్నారు.