: ఆ మూడు రాష్ట్రాలు బీజేపీవే: టుడేస్ చాణక్య సర్వే ఫలితాలు


తాజాగా జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించనుందని టుడేస్ చాణక్య సర్వే తెలిపింది. బీజేపీ ధాటికి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తోక ముడవనుందని సర్వే వెల్లడించింది. రాజస్థాన్ లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని సర్వే తెలుపగా, ఆ రాష్ట్రంలో బీజేపీ 136 నుంచి 158 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కానుందని సర్వే వెల్లడించింది.

కాగా మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ లలో మరోసారి అధికారంలో బీజేపీ కొనసాగుతుందని సర్వే వెల్లడించింది. మధ్యప్రదేశ్ లో హ్యాట్రిక్ విజయంతో బీజేపీ కాంగ్రెస్ కు అందనంత దూరంలో నిలుస్తుందని సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్ లో 150 నుంచి 172 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని మూడోసారి బీజేపీ అధికారం చేపడుతుందని, కాంగ్రెస్ 51 నుంచి 73 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

ఛత్తీస్ గఢ్ లో మరోసారి బీజేపీకే ఆ రాష్ట్ర పజలు పట్టం కట్టనున్నారని టుడేస్ చాణక్య స్పష్టం చేసింది. ఈ రాష్ట్రంలో 44 నుంచి 58 స్థానాలను గెలుచుకుని బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగుతుందనీ, 32 నుంచి 42 స్థానాలకు పరిమితమై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుందని సర్వే స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News