: భానుడి కిరణాలకు భక్తులు అడ్డు..!
శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణుడి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు వెల్లువెత్తారు. గత రెండ్రోజులుగా ఇక్కడి స్వామివారిపై ప్రసరిస్తున్న సూర్యకిరణాలకు నేడు భక్తులే అడ్డు అయ్యారు.
భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు ఆలయంలోని ధ్వజ స్థంభం వద్దకు తోసుకురావడంతో భానుడి కిరణాలు ఆలయంలోకి ప్రసరించలేదు. ఏదేమైనా, దర్శనానికి తగిన ఏర్పాట్లు చేయడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపిస్తున్నారు.