: ముగిసిన జీవోఎం భేటీ


ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి షిండే అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశం ముగిసింది. గంటన్నరపాటు పలువురు కేంద్ర మంత్రులు, న్యాయశాఖాధికారులతో సుదీర్ఘంగా సమావేశమైన జీవోఎం ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. అయితే ఇదే చివరి సమావేశం కాదని జీవోఎం సభ్యులు వెల్లడించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ, ఉమ్మడి రాజధాని, కాలపరిమితి, భద్రతాంశాలపై వీరు సమగ్రంగా చర్చించినట్టు సమాచారం. కాగా పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసేందుకు మరింత సమయం పట్టేలా ఉందని జీవోఎం వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత కూలంకుషంగా చర్చించేందుకు రేపు కూడా మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News