: రికార్డు ముంగిట ధోనీ సేన


మంచి జోరుమీదున్న టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలుచుంది. గతంలో కొన్ని జట్లు వరుసగా ఆరు వన్డే సిరీస్ లను గెలుచుకున్నాయి. కానీ ఏడు సిరీస్ లను మాత్రం ఆస్ట్రేలియా జట్టు తప్ప ఏ జట్టూ గెలుచుకోలేదు. ఇప్పుడు టీమిండియాను ఈ రికార్డే ఊరిస్తోంది. ఇప్పటికే ఆరు వన్డే సిరీస్ లను గెలుచుకున్న ఇండియా... సఫారీలను చిత్తు చేస్తే ఆసీస్ సరసన చేరుతుంది. దీంతో, గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

దక్షిణాఫ్రికా జట్టు ఫాం లేమితో ఇబ్బంది పడుతుండగా, వన్డేలలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. సౌతాఫ్రికాలో పిచ్ లు సీమ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయి. దాంతో సౌతాఫ్రికా బౌలర్లతో పాటు భారత బౌలర్లు కూడా ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలరు. బ్యాటింగ్ వరకు సౌతాఫ్రికా కంటే టీమిండియానే బలంగా ఉంది. దీంతో భారత జట్టుకు ఈ సిరీస్ లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News