: ఉద్యోగాలకు రాయలసీమ వాసులు ఎక్కడకు వెళ్లాలి? : జేసీ
రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగాల కోసం తమ ప్రాంత యువత ఎక్కడకు వెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ రైతులు దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎవరూ వ్యతిరేకించడం లేదన్న జేసీ, రాయల తెలంగాణ సరైన నిర్ణయమని తాను ముందు నుంచీ చెబుతున్నానని అన్నారు.