: బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కు పోలీస్ కస్టడీ
బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టు పది రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఐదు కోట్ల రికవరీ కేసులో యాదవ్, అతని భార్యకు వ్యతిరేకంగా ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త కొన్ని రోజుల కిందట దావా వేశారు. ఈ క్రమంలో అతని భార్యకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రిజిస్టర్ జనరల్ ఆఫీసుకు ఆమెను తరలించాలని జస్టిస్ ఎస్ మురళీధర్ ఆదేశించారు. మరోవైపు యాదవ్ తరపు ఇద్దరు లాయర్లకు జడ్జి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేశారు.