: లక్నో వెళ్లేందుకు జగన్ కు అనుమతి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్నో వెళ్లేందుకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో, జగన్ ఈ సాయంత్రం లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కలవనున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకించి సమైక్యానికి మద్దతు తెలపాలని కోరనున్నారు. మరోవైపు కోర్టుకు హాజరవడంపై మినహాయింపు నివ్వాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ వేశారు.