: స్మార్ట్‌ఫోన్‌తో మీరు పేపర్‌ విమానం నడపొచ్చు


మనం చిన్నప్పుడు స్కూలు నోట్సులో కాగితాలు చించి, వాటితో విమానాలు తయారుచేసి.. గాల్లోకి విసురుతూ.. టీచర్ల చేతిలో దెబ్బలు తినే ఉంటాం కదా. అలాంటి పేపర్‌ విమానాల్ని ఇప్పుడు ఎంచక్కా మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోలు చేయొచ్చు. అవి ఎగరడాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌తో నియంత్రించవచ్చు. గాల్లో మలుపులు, పల్టీలు అన్నీ మీ మునివేళ్ల కదలికలతో చేయించవచ్చు. ఇలాంటి ఓ కొత్త సాంకేతికను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

అమెరికాలోని డిజైనర్‌ షాయి గొయిటీన్‌, ఈ ప్రాథమికమైన పేపర్‌ మోడల్‌ విమానాన్ని కాస్త అప్‌గ్రేడ్‌ చేసేలా పవర్‌ అప్‌ 3.0ను రూపొదించారు. దానికో చిన్న ప్రొపెల్లర్‌, రాడార్‌, స్టీరింగ్‌ కంట్రోల్‌ పెట్టారు. స్మార్ట్‌ టెక్నాలజీ ద్వారా బ్లూటూత్‌తో ఇది పవర్‌అప్‌ 3.0తో అనుసంధానం అవుతుంది. ఒకసారి కనెక్ట్‌ అయ్యాక.. ఫోను ఎటు తిప్పితే ఆ పేపరు విమానం కూడా అటు తిరుగుతుందిట. అది అలా 60 గజాల దూరంలో తిరుగుతూ ఉంటుందిట. అయితే దీన్ని ప్రారంభించడానికి మీరే ఒక కాగితంతో పేపర్‌ విమానం ముందుగా తయారుచేసుకోవాలి. తర్వాత దానికి స్మార్ట్‌ మాడ్యూల్‌ ను క్లిప్స్‌తో బిగించాలి. బ్లూటూత్‌తో కనెక్ట్‌ అయితే చాలు.. ఇక ఎంచక్కా మీ పేపర్‌ విమానం ఎగురుతూనే ఉంటుందని దాని గురించి వివరాలు తెలియజేస్తున్నారు.

  • Loading...

More Telugu News