: కృష్ణా జిల్లా డిక్లరేషన్ ప్రకటించిన బాబు


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా డిక్లరేషన్ ప్రకటించారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర ముగించి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించే ముందు ఆయన పలు హామీలతో కూడిన డిక్లరేషన్ ను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే బందరు పోర్టు, పోలవరం డ్యామ్ లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని పేర్కొన్నారు.

కొల్లేరు అభయారణ్యం పరిధిలోని మత్స్యకారులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవడమే కాకుండా గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతామని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News