: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: బొత్స
రాష్ట్ర అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలంతా గౌరవిస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. పీసీసీ ఎలక్షన్ టాస్క్‌ఫోర్స్‌తో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాంతాలవారీగా ప్రజాభిప్రాయాన్ని వెల్లడిస్తారని బొత్స అన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఐదు కమిటీలను ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధికార ప్రతినిధి మహేశ్ గౌడ్ చెప్పారు. మీడియా మేనేజ్‌మెంట్, హోం మేనేజ్‌మెంట్, రీసెర్చ్ సర్వే, ఎలక్షన్ స్ట్రాటజీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.