: గన్ పార్క్ వద్ద టీ-జర్నలిస్టుల ఫోరం ధర్నా


రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గన్ పార్క్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం కల్గిస్తోందని, దీనిని సమర్థించే వారంతా తెలంగాణ ద్రోహులేనని జర్నలిస్టులు అన్నారు. కేంద్ర మంత్రివర్గానికి జీవోఎం సమర్పించే బిల్లులో రాయల తెలంగాణ ప్రతిపాదన ఉంటే... ఆ బిల్లు పార్లమెంటుకు రాక మునుపే మరోసారి సకల జనుల సమ్మె చేస్తామని తెలంగాణ జేఏసీ కో-ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప, ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించేది లేదని శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News